దుబాయ్ విమానంలో భారతీయులకు నో పర్మిషన్

దుబాయ్ విమానంలో భారతీయులకు నో పర్మిషన్
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో 200 మంది భారతీయులను వెనక్కి తిప్పి పంపుతున్న సిబ్బంది

హైదరాబాద్:  దుబాయ్ విమానంలో భారతీయులు వెళ్లకుండా శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు అడ్డుకున్నారు. సుమారు 200 మంది భారతీయ ప్రయాణికులను వెనక్కి తిప్పి పంపడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి దుబాయ్ కి వెళ్లే విమానంలో భారతీయులకు అనుమతి లేదంటూఎయిర్ పోర్టు అధికారులు చెప్పడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. భారత్ నుండి దుబాయ్ కు వెళ్లే విమానాలకు రేపటి నుండి నిషేధం ఉండగా శనివారం ఎందుకు పంపిచట్లేదని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎయిర్ పోర్టు అధికారుల వివరణను ప్రయాణికులు అంగీకరించడం లేదు. ఒకరోజు ముందే ఎలా నిషేధం అమలు చేస్తారని నిలదీస్తున్నారు.